

Active· since Apr 3, 2026
- 169
- days running
- 0
- relaunches
Ad copy
మేడమ్! ఆగండి… లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు!” అంటూ రిసెప్షనిస్ట్ అడ్డురావడంతో చైత్రా అడుగులు ఆగిపోయాయి. చేతిలో మాధవ్ కి ఇష్టమని వండిన క్యారేజీ బాక్స్ పట్టుకుని, ఎంతో ఆశగా ఆఫీసు మెట్లు ఎక్కిన చైత్రాకి, ఆ మాట ఒక చెంపదెబ్బలా తగిలింది. “ఏమన్నావు? పర్మిషనా? ఈ ఆఫీసు నాది. ఆ లోపల కూర్చున్న మాధవ్ నా భర్త. సొంత ఆఫీసులోకి రావడానికి, కట్టుకున్న భర్తను కలవడానికి నాకెవరి పర్మిషన్ అక్కర్లేదు. పక్కకి జరుగు,” అని చైత్రా గంభీరంగా హెచ్చరించింది. ఆమె కళ్ళలో ఆవేశం చూసి ఆ కొత్త రిసెప్షనిస్ట్ అమ్మాయి కాస్త భయపడి వెనక్కి తగ్గింది. “అది కాదు మేడమ్… సార్ అర్జెంట్ క్లయింట్ మీటింగ్ లో ఉన్నారు. ఎవరినీ లోపలికి పంపొద్దని స్ట్రిక్ట్ గా చెప్పారు. ప్లీజ్ నా ఉద్యోగం పోతుంది,” అని ఆ అమ్మాయి బతిమలాడింది. “క్లయింట్ మీటింగా? లంచ్ టైంలోనా?” చైత్రాకి అనుమానం వచ్చింది. నాలుగేళ్ళ క్రితం తను కూడా ఇదే ఆఫీసులో రాత్రింబవళ్లు కష్టపడింది. క్లయింట్ మీటింగ్స్ ఎలా జరుగుతాయో ఆమెకు తెలియనిది కాదు. ఏదో జరుగుతోంది. చైత్రా మారు మాట్లాడకుండా వేగంగా మాధవ్ క్యాబిన్ వైపు నడిచింది. అద్దాల తలుపుల వెనుక కర్టెన్లు వేసి ఉన్నాయి. లోపల నుండి సన్నగా నవ్వులు వినిపిస్తున్నాయి. ఆ నవ్వు మాధవ్ ది. మరొక గొంతు… ఒక ఆడగొంతు కిలకిలమంటూ నవ్వుతోంది. చైత్రా గుండె దడదడలాడింది. చేతిలో ఉన్న లంచ్ బాక్స్ ని గట్టిగా పట్టుకుని, ఒక్కసారిగా డోర్ తోసుకుని లోపలికి వెళ్ళింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి చైత్రా చేతిలోని బాక్స్ నేలజారిపోయింది. స్టీల్ బాక్సులు కిందపడి పెద్ద శబ్దం వచ్చినా, క్యాబిన్ లో ఉన్న ఇద్దరికీ అది వినిపించినట్లు లేదు. మాధవ్ తన రివాల్వింగ్ చైర్ లో వెనక్కి వాలి కూర్చుని ఉన్నాడు. అతని ఒడిలో… అవును, అతని ఒడిలో ఒక మోడ్రన్ అమ్మాయి కూర్చుని, మాధవ్ కి స్వయంగా పిజ్జా తినిపిస్తోంది. మాధవ్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఎంతో చనువుగా పట్టుకుని ఉన్నాడు. బాక్సులు పడిన శబ్ధానికి ఉలిక్కిపడి ఇద్దరూ తలతిప్పి చూశారు. చైత్రాను చూడగానే మాధవ్ మొహంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. అతను వెంటనే ఆ అమ్మాయిని పక్కకు తోసేసి, కంగారుగా లేచి నిలబడ్డాడు. “చై… చైత్రా! నువ్వేంటి ఇక్కడ? చెప్పకుండా వచ్చావు?” అంటూ మాధవ్ తడబడ్డాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఏమాత్రం భయం లేకుండా, విసుగ్గా జుట్టు సర్దుకుంటూ, “మాధవ్! ఎవరు ఈ ఆంటీ? ఇలా తలుపు కొట్టకుండా లోపలికి వచ్చేసింది? ఇదేనా మీ ఆఫీస్ మేనేజ్‌మెంట్? సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు?” అని చిరాకు పడింది. ఆ మాటకి చైత్రాకి కోపం నషాళానికి అంటింది. “ఆంటీనా? ఎవర్ని అంటున్నావే?” అంటూ ఆ అమ్మాయి వైపు అడుగు వేసింది చైత్రా. మాధవ్ వెంటనే చైత్రాకి అడ్డంగా వచ్చి, “చైత్రా! ప్లీజ్… సీన్ క్రియేట్ చేయకు. తను మన కొత్త ఇంటర్నేషనల్ క్లయింట్. రేష్మ గ్రూప్స్ వాళ్ళ అమ్మాయి. బిజినెస్ డీల్ గురించి మాట్లాడుతున్నాం,” అని అబద్ధం చెప్పడానికి ప్రయత్నించాడు. “బిజినెస్ డీల్ ఒడిలో కూర్చుని మాట్లాడుతారా మాధవ్? పిజ్జా తినిపించుకుంటేనే డీల్స్ ఓకే అవుతాయా? నన్ను ఇంకా ఎంతకాలం పిచ్చిదాన్ని చేస్తావు?” అని చైత్రా గట్టిగా అరిచింది. అప్పుడు ఆ అమ్మాయి వెటకారంగా నవ్వి, “ఓహో! ఈమెనా నీ భార్య? నువ్వు చెప్పిన వంటలక్క ఈమెనే అన్నమాట! ఫోటోలో కంటే బయట ఇంకాస్త ముసలిదానిలా ఉంది. ఇలాంటి దాంతో ఇన్నాళ్ళు ఎలా కాపురం చేశావ్ మాధవ్?” అని అవమానకరంగా మాట్లాడింది. “ఏయ్! నోరు అదుపులో పెట్టుకో!” అని చైత్రా చెయ్యి ఎత్తబోతుండగా, మాధవ్ చైత్రా చేతిని గట్టిగా పట్టుకుని ఆపేశాడు. అతని చూపుల్లో భార్య మీద ప్రేమ లేదు, ఆ అమ్మాయి మీద భయం, చైత్రా మీద అసహ్యం మాత్రమే కనిపించాయి. “చాలు చైత్రా! బయటకి వెళ్ళు. ఇక్కడ నా పరువు తీయకు. ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం,” అని మాధవ్ చైత్రాని బయటకి గెంటివేసే ప్రయత్నం చేశాడు. చైత్రా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏ ఆఫీస్ అయితే తను రక్తం ధారపోసి నిలబెట్టిందో, ఈరోజు అదే ఆఫీస్ లో తన భర్త, పరాయి అమ్మాయి ముందు తనని గెంటేస్తున్నాడు. ఆమె ఆత్మగౌరవం ముక్కలయ్యింది. మాధవ్ పక్కనే ఉన్న ఆ అమ్మాయి మెడలో మెరుస్తున్న ఒక డైమండ్ లాకెట్ ని చైత్రా గమనించింది. అది చైత్రా డిజైన్ చేయించుకున్న లాకెట్. మాధవ్ దాన్ని పాలిష్ చేయిస్తానని తీసుకెళ్ళాడు. ఇప్పుడు అది ఆ అమ్మాయి మెడలో ఉంది. భర్త...
మావిడాకులు
రాత్రి సమయం. నా కూతురు అనన్యను నిద్రపుచ్చి కాస్త కుదుటపడ్డాను. ఫోన్ చేతిలోకి తీసుకుని, ఏమీ తోచక టిక్‌టాక్ వీడియ....
LEARN MORELike this ad? Make it yours.
Crush rebuilds this exact creative around your product — your brand, your colors, your offer — in about a minute.







