Best Fiction Stories ad creative
Best Fiction Stories
Best Fiction Stories

Active· since Apr 7, 2026

164
days running
0
relaunches

Ad copy

టైమ్ రాత్రి దాదాపు పదకొండు గంటలు... ఏడునెలల కూతురి పక్కనే పడుకుని బెడ్ లైట్ వెలుతురులో భార్యని చూస్తున్న అతడికి ఆమె బాధపడుతుందని అర్థమై... పాప పక్కన పిల్లో పెట్టి, ప్చ్... ఏమయిందిరా ఎందుకు బాధ. నేను వచ్చినప్పటినుంచి చూస్తున్నా ఇవాలెందుకో నీలో నేను ఇంటికి వచ్చిన సంతోషమే లేదు. ఏం ఎందుకు?? వచ్చేదే వీక్లీ వన్స్... అప్పుడు కూడా కనికరించకపోతే ఎలా మేడం గారు కమాన్ రా!! ఎక్కువ ఆలోచిస్తూ నీ బుర్ర పాడుచేసుకుంటే ఎలా చెప్పుమా ఆమెని హత్తుకుని అడుగుతున్నా మౌనమే సమాధానంగా వస్తుంది భార్య నుంచి. ఉఫ్... ప్లీజ్ మాట్లాడు సరే ఇష్టం లేదా వదిలెయ్ బట్ హగ్ చేసుకుని పడుకో... అతని శరీరం ఇచ్ఛతో రగులుతుంటే ఆమె అనురాగపు మరులతో అతని కోరికని చల్లార్చుకోవాలి అనుకున్న అతని ఆశ అడియాశగా మారుతుంది. ఎంతకీ అంగీకారం అందలేదు సేమ్ టైమ్ ఆమె నిద్రలోకి జారుకున్నట్టుగా అనిపించి... నుదుటిన ముద్దు పెట్టుకుని ఆమె చీరకొంగులో తల దాచుకుంటాడు. టైమ్ ఉదయం ఆరుగంటలకు అరగంట ముందుగానే డోర్ సౌండ్ అవుతుంటే విసుగ్గా ఉమ్... హా.. అమ్మ వస్తున్న అని వెళ్లి డోర్ తీసి పాప, తను నిద్రపోతున్నారు. నేనుకూడా ఫ్రెష్ అయ్యేసి వస్తానని చెప్పి గదిలోకి వచ్చేస్తాడు. ఎయిట్ అవుతుంటే పాప తల్లి స్థన్యం కోసం వెతుక్కుంటూ ఏడుపురాగం అందుకుంటుంది. తల్లి మత్తుగా కదిలి లేచి కూర్చుని పాపకి ఫీడ్ చేసి, తర్వాత క్రెడిల్ లో పాపని వేసి తనుకూడా స్నానానికి వెళ్తుంది. హెడ్ బాత్ చేసి వస్తుందేమో భార్య ఎండలో అలా కురుల్ని విరబోసి టవల్ తో తుడుచుకుంటూ ఉంటే, ఒంటిమీద నీటి ముత్యాలు మెరుస్తుంటే... వాటిని చూసిన అతను అమాంతంగా వెళ్లి హత్తుకుని సారీ అంటాడు నిజాయితీగా. అసలే శనివారం పూజలు చెయ్యాలేమో అవేవి చెయ్యకపోయినా అతని చేతులు సున్నితంగా విడిపించుకుని కనీసం తులసికోట ముందు దీపం వెలిగించి... దణ్ణం పెట్టుకుని అక్కడనుంచి లివింగ్ రూమ్ లోకి వచ్చేస్తుంది. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆమె ఒక గృహిణి... పెళ్ళై రెండో యేడు జరుగుతుంటుంది. ఇల్లంతా కడిగిన ముత్యంలా ఉంది. పాలుపోసి దోసిలితో ఎత్తుకోవచ్చు అలా ఉంది. అత్తయ్య అన్నిపనులు అయినట్టున్నాయని అడుగుతుంది కోడలుపిల్లా. హా... అబ్బాయి ఉంటే అంతేగా ఇల్లు మెరవాల్సిందే అని పాలు కలుపుకుని వెళ్లి తాగు. అన్నట్టు ఇంకా పాప లేవలేదా?? అడుగుతుంది అత్త... లేదత్తయ్య... పాలు తాగేసి పడుకుంది. నేను మీ మామ చల్ల తినేసి పొలం దాకా ఎళ్ళొస్తాం. బయట అరుగు మీద ఉన్న పేపర్ తెచ్చి లోపల పెట్టుకో అమ్మాయని ఆవిడ చెప్తుంది. తను వెళ్లి చల్ల లోకి పచ్చిమిరపకాయ.. ఉల్లిపాయ కట్ చేసి చల్ల ఉన్న మట్టికుండలో వేసి కలియదిప్పి పాపకి.. భర్తకి కిచిడి కోసం కుక్కర్ ని స్టవ్ ఎక్కిస్తుంది. అప్పుడే మోటార్ ఆఫ్ చేసి వచ్చిన భర్త భార్య చేతిలో ఉన్న పాలగ్లాస్ ఖాళీ చేసి ఆమె పై పెదవి అంచుని తన నాలుకతో క్లీన్ చేసి, కన్నుకొట్టి బయటికి వచ్చేస్తాడు. అదొక గ్రామం అవడంతో పనులకు వెళ్లే వాళ్ళతో అరుగు మీద కూర్చుని ముచ్చట్లు పెట్టిన మామగారు. పొలానికి వెళ్ళడానికి జడ వేసుకుంటూ సిద్దపడుతున్న అత్తగారు ఉంటే, వాళ్లని చూస్తు ఉంటుంది కోడలు... మొదటినుంచి వ్యవసాయ ఆధారిత కుటుంబం అవడం అత్తమామలు బాగా కష్టపడి ఐదు ఎకరాల పొలం సాగు చేస్తూ ఉంటారు. మిగతా ఐదు ఎకరాల పొలంలో గవర్నమెంట్ సోలార్ ప్లేట్స్ పెట్టుకోవడానికి వీళ్ళ దగ్గర ఆ స్థలాన్ని అద్దెకు తీసుకుంటుంది. హైదరాబాద్ నుంచి ఐదుగంటల ప్రయాణం చేసి చేరుకునే ఊరు. పచ్చని పొలాలతో ఉంటుందా ఊరు ఉత్తరదామం. పొలాల మధ్యలో ఇల్లు ఉన్నట్టు ఉంటుంది. అంత పల్లెటూర్లో కూడా పదిసెంట్ల స్థలం మధ్యలో చక్కని ఆహ్లాదకరమైన ఇల్లు. ఇంటిచుట్టూ ప్రహరీ... చిన్నచిన్న పూల మొక్కలతో ఇంటిచుట్టూతా అందంగా అలంకరించినట్టు ఉంటాయి. ఆ ఇంటికి రెండు మాములు ద్వారాలు... ఒక సింహద్వారం ఉంటుంది. అన్ని వస్తువులు పొందికగా ఆ ఇంట్లో అమర్చి ఉంటాయి. పాతకాలపు వస్తువులతో సహా... టైమ్ తొమ్మిదికి పావు గంట తక్కువే!! అప్పటికే రెడీ అయి... పాన్స్ పౌడర్ అద్దుకుంటుంటే అత్తగారు, ఓ.. యబ్బో ఇప్పుడు పొలంలో సినిమా గాని తీస్తారా ఏమే నువ్వు నీ సోకు మనవరాలు పుట్టినా బుద్ది పోనిచ్చుకున్నావు గాదని మామగారు ఆట పట్టిస్తుంటే అత్తగారు మూతి తిప్పుకుంటూ... ఇంటికి ఎవరో ఒకరు వస్తారులే...

శతమానం ( life goes on...)

టైమ్ రాత్రి దాదాపు పదకొండు గంటలు... ఏడునెలల కూతురి పక్కనే పడుకుని బెడ్ లైట్ వెలుతురులో భార్యని చూస్తున్న అతడికి ...

LEARN MORE
🪄Crush AI

Like this ad? Make it yours.

Crush rebuilds this exact creative around your product — your brand, your colors, your offer — in about a minute.

More ads from Best Fiction Stories

Best Fiction StoriesBest Fiction Stories
Inactive
17 Days
-Reach
2Ads
Best Fiction Stories Facebook ad
Details
Best Fiction StoriesBest Fiction Stories
Inactive
40 Days
-Reach
2Ads
Best Fiction Stories Facebook ad
Details
Best Fiction StoriesBest Fiction Stories
Inactive
126 Days
-Reach
1Ads
Best Fiction Stories Facebook ad
Details
Best Fiction StoriesBest Fiction Stories
Active
171 Days
-Reach
1Ads
Best Fiction Stories Facebook ad
Details
Best Fiction StoriesBest Fiction Stories
Inactive
40 Days
-Reach
1Ads
Best Fiction Stories Facebook ad
Details
Best Fiction StoriesBest Fiction Stories
Active
37 Days
-Reach
Best Fiction Stories Facebook ad
Details
Best Fiction StoriesBest Fiction Stories
Active
64 Days
-Reach
Best Fiction Stories Facebook ad
Details
Best Fiction StoriesBest Fiction Stories
Inactive
26 Days
-Reach
Best Fiction Stories Facebook ad
Details
Best Fiction Stories Ad — Running 164 Days | Crush Ad Library