

Inactive· since Apr 7, 2026
- 113
- days it ran
- 0
- relaunches
Ad copy
“ నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా ?వర్క్ చేసేటప్పుడు ఏ లోకంలో ఉంటావు ?అన్నీ మిస్టేక్సే ఉన్నాయి. వెళ్లి కరెక్ట్ చేసుకుని తీసుకుని రా.!” అని ఆ రూమ్ దద్దరిల్లిపోయేలా అరిచాడు శ్రీధ పనిచేస్తున్న కంపెనీ ఏం. డి అగస్త్య చక్రవర్తి. ఆయన అరిచి అరుపులకి తనకు తెలియకుండానే ఉలిక్కిపడింది శ్రీధ. ఆమెకి చాలా కోపం వచ్చింది. “ రాక్షసుడా .. మిస్టేక్స్ ఉంటే ఇంత దారుణంగా ఎవరూ తిట్టరు. నీ కోపంతో చచ్చిపోతున్నాను.” అని తనలో తానే తిట్టుకుంటూ వెంటనే ఆ ఫైల్ చేతిలోకి తీసుకుని, అక్కడే నిలబడి ఆ ఫైల్ ఓపెన్ చేసి చెక్ చేసింది . అందులో ఒక్క మిస్టేక్ కూడా లేదు. కానీ అందులో మిస్టేక్ లేదని చెప్పినా అతని ఈగో హర్ట్ అయ్యి , ఇంకో కారణం వెతికి మరీ తిడతాడని శ్రీధకి బాగా తెలుసు. ‘ అసలే ఆఫీస్ కి లేటుగా వచ్చాను. ఇప్పుడు ఇందులో మిస్టేక్స్ లేవని చెప్తే వీడి ఈగో హర్ట్ అయిపోయి ఇంకా తిడతాడు. సో సైలెంట్ గా ఎక్కడినుంచి బయట పడదమే బెటర్’ అని తనలో తనే అనుకుంటూ ఆ ఫైల్ తీసుకుని మౌనంగా ఆ ఛాంబర్ నుండి తన డెస్క్ దగ్గరకు వచ్చి ప్రశాంతంగా ఊపిరి తీసుకొని, ఆరోజు చేయాల్సిన వర్క్ ఏంటో చూసుకునే పనిలో పడిపోయింది శ్రీధ . ఒంటిగంట ఆ సమయంలో ఆ ఫైల్ మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేసింది . ‘ మిస్టేక్ కరెక్షన్ చేసినట్టు ఆయన గారికి చెప్పాలి కదా … పొరపాటున ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను చంపేస్తాడు . మరొకసారి చెక్ చేసి చూస్తాను.’ అని తనలో తనే అనుకుంటూ ఆ ఫైల్ మొత్తం పాయింట్ టు పాయింట్ చెక్ చేసింది .ఎక్కడా ఏ మిస్టేక్స్ లేవు . పైగా క్లయింట్ కి పంపించడానికి ఫైల్ మీద అగస్త్య చక్రవర్తి అని సైన్ కూడా ఉంది. అది చూడగానే శ్రీధకి పిచ్చి కోపం వచ్చింది. తన బాస్ కావాలనే తన మీద అరుస్తున్నాడని క్లియర్గా అర్థమైపోయింది. ఫైల్ తీసుకుని తన బాస్ మొఖాన కొట్టాలి అన్నంత కోపం వస్తుంటే బలవంతంగా కంట్రోల్ చేసుకుని సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఇంతలో ..”శ్రీ లంచ్ చేయవా?” అంటూ వచ్చి శ్రీధ భుజం మీద చేయి వేసి నిద్రలేపింది శ్రీధ ఫ్రెండ్ వినీల. తన బ్యాగ్ లో బాక్స్ కోసం వెతికింది శ్రీ. కానీ కాళీ బ్యాగ్ దర్శనం ఇచ్చింది . మార్నింగ్ ఆఫీస్ కి వచ్చే హడావుడిలో లంచ్ బాక్స్ మర్చిపోయిన విషయం గుర్తొచ్చి నీరసంగా ఒక చిన్న నవ్వుకుని “నాకు ఆకలిగా లేదు విన్నీ . నువ్వు లంచ్ చేసేయ్.!” అని వినీలకి చెప్పి పంపించేసింది . నిజానికి శ్రీధకు చాలా ఆకలిగా ఉంది . కానీ క్యాంటీన్లో ఫుడ్ కోసం డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేదు . సంపాదించే ప్రతీ పైసా జాగ్రత్తగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి తనది ‘ ఈ పూటకి మంచినీళ్లు తాగి సరిపెట్టుకుందాం లే ‘ అనుకుని డెస్క్ మీద తల పెట్టుకుని అలాగే పడుకుంది . కాసేపటికి షూ అడుగులు వినిపిస్తుంటే తల పక్కకి తిప్పి చూసింది. మోడ్రన్ ప్రవరాఖ్యుడీలా , నవ మన్మధుడులా పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని మరో చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకొని ఒక రేంజ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ నడుచుకుంటూ వస్తూ కనిపించాడు వాళ్ళ బాస్ అగస్త్య చక్రవర్తి. అప్రయత్నంగానే లేచి నిలబడింది శ్రీధ అతను ఆమెకి దెగ్గరగా వచ్చి ..” చూడు నా క్యాబిన్లో లంచ్ బాక్స్ ఉంది.నేను బయటికి వెళుతున్నాను. ఆ లంచ్ వేస్ట్ అవుతుంది. ఎలాగో ఖాళీగానే ఉన్నవ కద…సో ఆ బాక్స్ లో ఉన్న ఫుడ్ నువ్వే తినాలి. “ అని గంభీరంగా అన్నాడు “సర్ నాకు ఆకలిగా లేదు . నేను ఆ ఫుడ్ తినలేను .” అని సౌమ్యంగా, స్థిరంగా చెప్పింది శ్రీ. అతని వెంటనే శ్రీధ చేతులు పట్టుకుని గట్టిగా అతని వైపుగా లాక్కున్నాడు . అతడు లాగిన వేగానికి స్ప్రింగ్ లా వెళ్లి అతని మీద పడింది శ్రీధ . ఆ హఠాత్పరిణామానికి బిత్తరపోయి, చూస్తున్న శ్రీధని ఎటూ కదలనివ్వకుండా ఆమె చేతిని వెనక్కి మడిచి గట్టిగా పట్టుకున్నాడు . శ్రీ వైపు కోపంగా చూస్తూ..” నా మాటకి ఎదురు చెప్తావా ? నా లంచ్ బాక్స్ నువ్వే తినాలి. నేను ఇంకో వన్ అవర్ లో వస్తాను ఆ టైం కల్లా నా బాక్స్ ఖాళీ అయిపోయి ఉండాలి లేకపోతే ఏం జరుగుతుందనేది తెలుసు కదా “ అని గట్టిగా అరిచాడు . శ్రీధ కళ్ళలోంచి నీళ్లు తిరిగిపోయాయి . తన దగ్గర డబ్బు లేదు కానీ ఆత్మ అభిమానం ఉంది. తన బాస్ చెప్పినట్టుగా ఆ లంచ్ బాక్స్ శ్రీధ తింటుందా ? ఏదో ఒక వంక...
మిస్సెస్ అగస్త్య
( ఈ కథలో పాత్రలు, సన్నివేశాలు, ప్రదేశాలు కేవలం కల్పితం ) మా బాస్ అంటే చచ్చేంత భయం నాకు. చూడడానికి మోడరన్ ప్రవరాఖ్య.....
LEARN MORELike this ad? Make it yours.
Crush rebuilds this exact creative around your product — your brand, your colors, your offer — in about a minute.







